Fri Dec 05 2025 11:59:09 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : జానారెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ఇంటికి వెళ్లారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ఇంటికి వెళ్లారు. రాజ్ భవన్ లో జరిగిన లోకాయుక్త ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి నుంచి నేరుగా జానారెడ్డికి ఇంటికి చేరుకున్నారు. అయితే కాల్పుల విరమణ, శాంతిభద్రతల సమస్యపై జానారెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించేందుకు వెళ్లారు.
మావోయిస్టులతో శాంతి చర్చలు...
మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలంటూ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శాంతి చర్చల కమిటీ ప్రతినిధులు కోరారు. ఇందుకు రేవంత్ కూడా సానుకూలంగా స్పందించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని శాంతి కమిటీ సభ్యులు అడగడంతో దీనిపై చర్చించేందుకు రేవంత్ రెడ్డి జానారెడ్డి ఇంటికి వెళ్లారని చెబుతున్నారు. దీంతో పాటు కొన్ని రాజకీయ పరమైన అంశాలు కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది.
Next Story

