Thu Mar 19 2026 15:04:49 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : కేసీఆర్కు రేవంత్ రెడ్డి పరామర్శ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను పరామర్శించారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను పరామర్శించారు. సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లిన రేవంత్ రెడ్డి కేసీఆర్ యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ ను తాను పరామర్శించానని, బాగానే ఉన్నారని, ఆయన కోలుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
కాలు జారి పడి....
కేసీఆర్ కొద్ది రోజుల క్రితం ఎర్రవెల్లిలోని తన ఫాం హౌస్ లో పంచె తగిలి కింద పడటంతో కాలు ఫ్రాక్చర్ అయిన సంగతి తెలిసిందే. కేసీఆర్ వెంటనే యశోదా ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆయన తుంటి ఎముకకు సర్జరీ చేశారు. ఇప్పడిప్పుడే వాకర్ ద్వారా ఆయన నడుస్తున్నారు. ఆయనను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కొందరు మంత్రులు పరామర్శించారు.
Next Story

