Tue Jan 20 2026 18:18:14 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. యాదాద్రిలో కీ డెసిషన్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. యాదాద్రిని యాదగిరి గుట్టగానే పిలవాలని నిర్ణయించారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. యాదాద్రిని యాదగిరి గుట్టగానే పిలవాలని నిర్ణయించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహదేవస్థానానికి కూడా ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. పాలకమండలి ఉన్నప్పుడే దేవాలయం అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.
మరికాసేపట్లో...
యాదగిరిగుట్టలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి దేవాదాయ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఆలయ అభివృద్ధిపై ఆయన సమీక్షలు జరిపారు. మరికాసేపట్లో సంగెం నుంచి మూసీ పునరుజ్జీవ యాత్రను ప్రారంభించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలసి బస్సులో యాదగిరిగుట్ట నుంచి మరికాసేపట్లో సంగెంకు బయలుదేరి వెళతారు.
Next Story

