Thu Dec 18 2025 10:09:18 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : నేడు ఎస్.ఎల్.బి.సి టన్నెల్ వద్దకు రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్ లో బయలుదేరి వనపర్తిలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు. ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు వనపర్తిలోని జడ్పీ హైస్కూలును సందర్శిస్తారు.
వనపర్తిలో పలు కార్యక్రమాలు...
మధ్యాహ్నం 2.15 గంటలకు రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉపాథి పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. తర్వాత మహిళలకు కుట్టుమిషన్లను పంపిణీ చేయనున్నారు. అనంతరం అక్కడ జరిగే ఉద్యోగ మేళాలో పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సాయంత్రం ఐదు గంటలకు వనపర్తి నుంచి నేరుగా శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ వద్దకు రేవంత్ రెడ్డి చేరుకోనున్నారు. అక్కడ సహాయక చర్యలను అడిగి తెలుసుకోనున్నారు.
Next Story

