Fri Dec 05 2025 11:28:23 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : నేడు చెన్నైకు ముఖ్యమంత్రి రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు చెన్నై కు వెళ్లనున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు చెన్నై కు వెళ్లనున్నారు. తమిళనాడు ప్రభుత్వం చేపట్టనున్న మహావిద్యా చైతన్య ఉత్సవాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెన్నై బయలుదేరి వెళుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రత్యేక ఆహ్వానం మేరకు రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్నారని అధికారులు తెలిపారు.
మహా విద్య చైతన్య ఉత్సవాలలో...
తమిళనాడు ప్రభుత్వం మహా విద్య చైతన్య ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంది. ఇందుకు సంబంధించిన కొందరికి మాత్రమే ఆహ్వానాలు పంపింది. అందులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకరు. ఈ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెన్నై నుంచి ఈరోజు సాయంత్రానికి తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు.
Next Story

