Fri Dec 05 2025 11:27:14 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి తెలంగాణలో రైతు నేస్తం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మంత్రులతో సమావేశమవుతారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మంత్రులతో సమావేశమవుతారు. కీలక అంశాలపై చర్చిస్తారు. ముఖ్యంగా రైతు భరోసాతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చిస్తారు. అంతకంటే ముందు తెలంగాణలో ఈరోజు రైతు నేస్తం కార్యక్రమం ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనునున్నారు.
మంత్రివర్గ సభ్యులతో సమావేశం...
నేటి నుంచి తెలంగాణలో రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దీంతో పాటు రైతులతో నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖాముఖి కార్యక్రామాన్ని నిర్వహిస్తారు. ఇందులో1,031 మంది రైతులతో రేవంత్ రెడ్డి పాల్గొంటారు.
Next Story

