Fri Dec 05 2025 09:14:53 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Redddy : నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేడు రేవంత్ కీలక భేటీ
నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు

నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యనేతలు పాల్గొననున్నారు. ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించే అవకాశముంది. ఇప్పటికే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మంత్రులు కమిటీని నియమించడంతో వారి అభిప్రాయాలను కూడా తీసుకోనున్నారు.
అభ్యర్థి ఎంపికపై...
నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో త్వరలో నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. ఇప్పటికే బీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. ఈ నేపథ్యంలో నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ అభ్యర్థిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. స్థానికంగా ఉండే వారికి టిక్కెట్ ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించడంతో ఎవరికి ఇవ్వాలన్న దానిపై నేడు చర్చించి పార్టీ హైకమాండ్ కు నివేదించనున్నారు.
Next Story

