Fri Jan 02 2026 08:32:47 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : మూసీ కాలుష్యం కంటే కొందరి కడుపులో విషం ఎక్కువ
మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు

మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మూసీలో ఉండే కాలుష్యం కంటే కొంత మంది కడుపులో విషం ఎక్కువ అని అన్నారు. అన్ని మతాల వారినీ తమ ప్రభుత్వం సమానంగా గౌరవిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. పాతబస్తీలో అన్ని రకాలుగా అభివృద్ధి చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే బాపూ ఘాట్ వద్ద సరోవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని రేవంత్ రెడ్డి తెలిపారు. 450 కోట్ల రూపాయలతో వంతెన నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
అంతర్జాతీయ నగరంగా...
హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఆలయాలు, మసీదులు, చర్జిలు, గురుద్వారాలు నిర్మిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ నిర్వాసితులకు మంచి కాలనీలను నిర్మించి ఇస్తామని చెప్పారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మూసీ కంపు కంటే రేవంత్ రెడ్డి నోటి కంపు ఎక్కువగా ఉందని అన్నారు. మూసీ నదిపై చర్చ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది.
Next Story

