Wed Dec 24 2025 04:22:32 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ఐఏఎస్ లకు రేవంత్ కీలక ఆదేశాలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులపై సీరియస్ అయ్యారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులపై సీరియస్ అయ్యారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిందని అధికారులు విజన్ 2047 పాలసీని అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఈ రెండేళ్లలో కొన్ని విజయాలు సాధించామని, కొన్ని ప్రణాళికలు రూపొందించుకున్నామని తెలిపారు. గతంలో ఎనర్జీ, ఎడ్యుకేషన్, ఇరిగేషన్, హెల్త్ లాంటి వివిధ శాఖలకు సంబంధించి ఒక పాలసీ లేకపోవడంతో కొన్ని సమస్యలు వచ్చాయన్న రేవంత్ రెడ్డి అందుకే ముఖ్యమైన విభాగాలకు ఒక పాలసీని తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రానికి ఒక పాలసీ ఉండాలని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేసుకున్నామన్న ఆయన రాష్ట్రాన్ని క్యూర్ ( CURE), ప్యూర్ (PURE), రేర్ (RARE) గా విభజించి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నామని తెలిపారు.
ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ...
స్పష్టమైన విధి విధానాలతో ముందుకు వెళుతున్నామన్న రేవంత్ రెడ్డి ఎంత గొప్ప కార్యాచరణ తీసుకున్నా అధికారుల సహకారం ఉండాలన్నారు. అధికారులు జవాబుదారీతనంతో పని చేయాలని, ప్రతీ నెల కార్యదర్శుల పనితీరుపై సీఎస్ సమీక్షిస్తారని అధికారులకు తెలిపారు. కార్యదర్శులు సీఎస్ కు ప్రతీ నెల రిపోర్ట్ సమర్పించాలని, ప్రతీ మూడు నెలలకు ఒకసారి మీ పనితీరుపై తానే స్వయంగా సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. శాఖల మధ్య, శాఖల అధికారుల మధ్య సమన్వయం లేకపోతే ఎలాంటి ఫలితాలు రావన్న రేవంత్ రెడ్డి సమన్వయం చేసుకుని పనిచేయడం అత్యంత కీలకమని తెలిపారు.
Next Story

