Fri Dec 05 2025 14:04:45 GMT+0000 (Coordinated Universal Time)
దావోస్ లో బోణీ కొట్టిన తెలంగాణ సర్కార్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. తెలంగాణలో యూనిలివర్ కంపెనీ ఏర్పాటుకు ఓకే అయింది. దీనివల్ల ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో దావోస్ పర్యటనలో రేవంత్ రెడ్డి బృందం తొలి ఒప్పందం చేసుకున్నట్లయింది. నిత్యావసరవస్తువుల తయారీలో యూనిలివర్ కంపెనీ ప్రసిద్ధి గాంచింది.
కామారెడ్డి జిల్లాలో...
యూనిలివర్ కంపెనీ ప్రతినిధులతో జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయని, పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించిందని రేవంత్ రెడ్డి ట్వీ్ చేశారు. దీంతో ప్రభుత్వానికి, యూనిలివర్ కంపెనీ మధ్య ఒప్పందం కుదిరింది. తొలి విడతలో భాగంగా తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బాటిల్ క్యాప్ ల తయారీ యూనిట్ ను నెలకొల్పేందుకు కూడా యూనిలివర్ సంసిద్ధత వ్యక్తం చేసింది.
Next Story

