Fri Dec 05 2025 12:38:02 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నిజామాబాద్ జిల్లా వాసులకు రేవంత్ గుడ్ న్యూస్
సమస్యలు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు

సమస్యలు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డిలో అధికారులతో సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కురిసిన వరదల వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. పంట నష్టంతో పాటు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో భారీగా నష్టం సంభవించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే వరద నష్టం అంచనాలను వెంటనే తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాధమికంగా నష్టాలను అంచనా వేశారని, తన వద్ద ఆ లెక్కలు ఉన్నాయన్న రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేయాలన్నారు.
వరద బాధితులకు...
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మొత్తం ప్రభావితమయిందన్నారు. జిల్లాలో ఎక్కడెక్కడ ఏ సమస్యలున్నాయన్నది తనకు నివేదిక అందించాలని, అందరి ఎమ్మెల్యేలతో కూర్చుని కలెక్టర్ తో పాటు అన్ని శాఖల అధికారుల నష్టం అంచనాలను రూపొందించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వానికి సాయం కోసం నివేదిక పంపాలని రేవంత్ రెడ్డి కోరారు. అదే సమయంలో తాను మరో పదిహేను రోజుల్లో మరోసారి సమీక్ష చేస్తానని, అప్పుడు పూర్తిస్థాయి వివరాలతో తన ముందుకు రావాలని రేవంత్ రెడ్డి కోరారు. వరదల వల్ల నష్టపోయిన అందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
Next Story

