Mon Dec 08 2025 19:59:57 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : ఏపీతో మేము వివాదాలను కోరుకోవడం లేదు
ఆంధ్రప్రదేశ్ తో తాము వివాదాలను కోరుకోవడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు

ఆంధ్రప్రదేశ్ తో తాము వివాదాలను కోరుకోవడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అలాగని తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టే ప్రసక్తి లేదని తేల్చ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం సమావేశాలు నిర్వహిస్తామని చెప్పిందని అన్నారు. బనకచర్ల ప్రాజెక్టు డీటెయిల్డ్ రిపోర్టును తెలంగాణకు ఇవ్వాల్సిందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 2016లో బనకచర్ల ప్రాజెక్టుకు పునాది రాయి పడిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. నాడు అధికారంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పొడుగు పెరిగినంత మాత్రాన జ్ఞానం పెరిగినట్లు కాదని రేవంత్ రెడ్డి అన్నారు.
పొడుగు పెరిగినంత మాత్రాన...
బీఆర్ఎస్ రాజకీయంగా చచ్చిపోయిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలతోనే బీఆర్ఎస్ ఇంతవరకూ బతికిందని, తిరిగి దానిపైనే ఆధారపడి బతకాలని భావిస్తుందన్నారు. హరీశ్ రావు నుఉద్దేశించి కూడా రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పంొడుగు పెరిగినంత మాత్రాన ఉపయోగం లేదని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు రాకూడదనే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం నాడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా ఇదే స్పష్టం చేసిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న కొత్త ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. బనచర్ల ప్రాజెక్టు ఫీజిబులిటీ రిపోర్టును ముందుగానే తెలంగాణకు ఇచ్చి ఉంటే ఇంత గొడవలు వచ్చేవి కావని, అయినా బనకచర్ల ప్రాజెక్టుపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించనున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.
Next Story

