Sat Dec 13 2025 22:34:12 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : ఉప ఎన్నికల్లో గెలుపు మాపై మరింత బాధ్యతను పెంచింది
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపుపై ఆయన మాట్లాడారు. గెలిస్తే గెంతులేయడం, ఓడిపోతే కుంగిపోవడం కాంగ్రెస్ పార్టీ నైజం కాదని అన్నారు. ఈ గెలుపు ప్రభుత్వ బాధ్యతను మరింత పెంచిందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో సీట్లు రాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అదే సమయంలో రెండు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ హైదరాబాద్ నగరంలో గెలిచిందని అన్నారు. కేంద్రం ప్రభుత్వం నిధులు రాబట్టుకునేందుకు కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని అన్నారు.
కేటీఆర్ అహంకారాన్ని, హరీశ్ అసూయను...
హరీశ్ రావు అసూయను తగ్గించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. జంటనగరాల్లో మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన కోరుకున్నారని అన్నారు. కేటీఆర్ అహంకారం తగ్గించాలని కోరారు. హరీశ్ రావు అసూయను, కేటీఆర్ అహంకారాన్ని ప్రజలు తీసుకోలేకపోతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజా సమస్యలపై తగిన సూచనలు ఇవ్వాలని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే ప్రయోజనం లేదని అన్నారు. కిషన్ రెడ్డి అభ్యర్థిగా మారి ప్రచారం చేసినా పదిహేడు వేల ఓట్లు మాత్రమే వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. బీజేపీకి డిపాజిట్లు గల్లంతయ్యాయని అన్నారు. తమ పరిపాలనలో తీసుకున్న నిర్ణయాలకు ప్రజల ఆమోదం లభించిందని చెప్పారు.
ఫేక్ సర్వేల ద్వారా...
అధికారం శాశ్వతం కాదని, రాజకీయం వారసత్వం కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఫేక్ సర్వేల ద్వారా లబ్దిపొందాలనుకుంటే ప్రయోజనం ఉండదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఓట్ల శాతం పెరిగిందని, గత శాసనసభ ఎన్నికల్లో వచ్చిన దానికంటేపార్లమెంటు ఎన్నికల్లోనూ, ఉప ఎన్నికల్లోనూ ఓట్ల శాతం పెరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు కలసి కట్టుగా పనిచేస్తేనే ఇంతటి ఘన విజయం సాధించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజలు అభివృద్ధి సంక్షేమాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
Next Story

