Tue Mar 17 2026 01:05:05 GMT+0530 (India Standard Time)
Telangana : వేములవాడలో సీఎం రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడకు చేరుకున్నారు. రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడకు చేరుకున్నారు. రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. 127 కోట్ల రూపాయలను వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధి కోసం నిధులను కేటాయించిన ప్రభుత్వం ఈరోజు పనులను ప్రారంభిస్తుంది.
తొలిసారి వచ్చిన...
ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా వేములవాడ వచ్చిన రేవంత్ రెడ్డికి పార్టీ నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ అభివృద్ధి పనులతో పాటు వేములవాడలో వివిధ పనులకు సంబంధించి ఆయన భూమిపూజ చేయనున్నారు. ఈ సందర్భంగా అధికారులు భారీ ఏర్పాట్లను చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
Next Story

