Wed Jan 28 2026 21:56:37 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : ప్రధాని మోదీ ముందుంచిన వినతలివే
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. అనేక అంశాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలిసింది. ఫ్యూచర్ సిటీకి సహకారం అందించాలని రేవంత్ ఈ సందర్భంగా ప్రధాని మోదీని కోరినట్లు సమాచారం. అలాగే పెరుగుతున్న జనాభా, రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ తో మెట్రో విస్తరణ పనులకు కూడా సహకరించాలని మోదీని రేవంత్ కోరినట్లు తెలిసింది.
మూసీ పునరుద్ధరణకు...
కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులతో పాటు వివిధ పెండింగ్ ప్రాజెక్టులను కూడా వెంటనే అమలు చేసేలా అధికారులను ఆదేశించాలని కూడా రేవంత్ ప్రధానిని కోరినట్లు చెబుతున్నారు. మూసీ పునరుద్ధరణకు కూడా సహకరించాలని ప్రధానిని రేవంత్ కోరారు. ఎస్ఎల్.బి.సి. ప్రమాదంపై అప్ డేట్ ను ప్రధానికి వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు.
Next Story

