Wed Mar 18 2026 22:49:26 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : సోనియాతో రేవంత్ భేటీ.. తెలంగాణలో పోటీ చేయాలంటూ?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన ఈ సమావేశంలో తాము చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను గురించి రేవంత్ రెడ్డి సోనియాకు వివరించినట్లు తెలిసింది. ఆరు గ్యారంటీలలో ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు పర్చామని, మరో రెండు గ్యారంటీల అమలుకు కూడా సిద్ధమయినట్లు తెలిపారు.
అమలవుతున్న పాలన గురించి...
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పాలన, అమలవుతున్న సంక్షేమ పథకాలను గురించి ఆయన సోనియాకు వివరించారు. అయితే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని రేవంత్ రెడ్డి సోనియాను విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటీ అమలు చేస్తున్నామని, పార్లమెంటు ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలను సాధిస్తామని చెప్పినట్లు తెలిసింది. రేవంత్ రెడ్డి వెంట ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా ఉన్నారు.
Next Story

