Sun Dec 21 2025 05:29:10 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : రేపు రేవంత్ రెడ్డి కీలక సమావేశం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మంత్రులతో సమావేశం కానున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మంత్రులతో సమావేశం కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగనుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ సమావేశం జరగనుంది. పంచాయతీ ఎన్నికలు ముగియడంతో ఇక మున్సిపల్ ఎన్నికలు జరిపే తేదీ విషయంపై ప్రధానంగా రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చించనున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో...
మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గుర్తు ఉంటుంది కాబట్టి అత్యధిక స్థానాలను కైవసం చేసుకునే దిశగా మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే బీసీ రిజర్వేషన్లను 42 శాతం మేరకు పార్టీ పరంగా కల్పించడంపై కూడా మంత్రులతో చర్చించనున్నారని సమాచారం. దీంతో పాటు అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణపై కూడా మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించనున్నారు.
Next Story

