Thu Jan 29 2026 02:58:38 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్... వారికే మంత్రులుగా అవకాశం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి వర్గ విస్తరణపై అనుసరించబోయే విధివిధానాలను ఆయన మీడియాకు తెలిపారు. తెలంగాణకు ఏడు లక్షల కోట్లకు పైగా అప్పులున్నాయని ఆయన తెలిపారు. వాటి వడ్డీల్లో ఏ మాత్రం తగ్గినా వెయ్యి కోట్ల రూపాయలు ప్రతి ఏటా తెలంగాణ ప్రభుత్వానికి ఆదా అవుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. మీడియా ప్రకాంగ్రెస్ బీఫారం మీద గెలిచిన వారికే మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.
కేసీఆర్ చేసిన తప్పులు...
కేసీఆర్ చేసిన తప్పులు తాము చేయబోమని తెలిపారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పోస్టింగ్స్ లో రూల్స్ ను బ్రేక్ చేయదలచుకోలేదని తెలిపారు. మహిళ ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీ గాడిన పడిందని రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో చెప్పారు. పీసీసీ చీఫ్ ను హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని పీసీసీ చీఫ్ ఎంపిక జరుగుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈరోజు కూడా పార్టీ పెద్దలతో ఆయన కలసి మంత్రి వర్గ విస్తరణపై చర్చించే అవకాశముంది.
Next Story

