Thu Apr 09 2026 14:41:17 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : నేనే రాజు.. నేనే మంత్రి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు నేనే రాజు.. నేనే మంత్రి అని అన్నారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించనని, తనను విమర్శించిన వారినే తాను తప్పుపడతానని తెలిపారు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మరో పదిన్నరేళ్లు తానే ముఖ్యమంత్రిని అని రేవంత్ రెడ్డి తెలిపారు.
పదిన్నరేళ్లు నేనే సీఎం
2029లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయన్న రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసు క్లైమాక్స్ కు చేరుకుందని, దర్యాప్తు ఆధారంగానే ముందుకు వెళతామని రేవంత్ రెడ్డడి చెప్పారు. తనకు ఎవరు పోటీ కాదన్న రేవంత్ రెడ్డి ఏ ఎన్నికల్లోనైనా కాంగ్రెస్ పార్టీదే విజయం అని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై దర్యాప్తు జరపాలని సీబీఐకి లేఖ రాసినా ఇంత వరకూ నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
Next Story

