Tue Feb 03 2026 00:40:42 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : తెలంగాణకు మోదీ ఇచ్చింది ఏంది గాడిద గుడ్డా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు మోదీ చేసింది ఏమీ లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దుచేసే ఆలోచన చేస్తుందన్నారు. రాజ్యాంగాన్ని మార్చడానికే నాలుగు వందల స్థానాలు రావాలని ఆ పార్టీ కోరుకుంటుందని అన్నారు. వరంగల్ కు అవుటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్టు రాకుండా మోదీ అడ్డుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
హామీలు అమలు చేయాలని...
ప్రధాని హామీలు అమలు చేయాలని తాను కోరుతుంటే తనపై అక్రమకేసులు పెడుతున్నారన్నారు. తెలంగాణకు మోదీ గాడిద గుడ్డు తెచ్చారా? అంటూ ఎద్దేవా చేశఆరు. గాంధీ భవన్ కు పోలీసులను పంపించి తనను అరెస్ట్ చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించారని రేవంత్ రెడ్డి అన్నారు. గత ఎన్నికల స్ఫూర్తితోనే మోదీ గ్యాంగ్ కు బుద్ధి చెప్పాలన్నారు. నామా నాగేశ్వరరావు మంత్రి అవుతారని చెబుతున్నారని, బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీకి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏముంటుందని ఆయన ప్రశ్నించారు.
Next Story

