Fri Dec 05 2025 18:04:33 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : కేరళ లో రేవంత్ ఎన్నికల ప్రచారం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కేరళ బయలుదేరి వెళ్లారు. వాయనాడ్ నియోజకవర్గ పరిధిలో ప్రచారాన్ని నిర్వహించనున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కేరళ బయలుదేరి వెళుతున్నారు. ఆయన వాయనాడ్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రచారాన్ని నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు కేరళలోనే రేవంత్ రెడ్డి ఉండనున్నారు. వాయనాడ్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న నేపథ్యంలో అక్కడ ప్రచారాన్ని నిర్వహించేందుకు వెళుతున్నారు.
తెలుగు ప్రజలతో...
వాయనాడ్ లో ఉన్న తెలుగు ప్రజలతో పాటు అక్కడి ఓటర్లను ఆకట్టుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రచారం ఉపయోగపడుతుందని భావించిన పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు ఆయన కేరళకు బయలుదేరి వెళ్లారు. వాయనాడ్ లో రోడ్ షోలు నిర్వహించనున్నారు. కార్నర్ మీటింగ్ లలో పాల్గొననున్నారు. ఈరోజు, రేపు రేవంత్ రెడ్డి కేరళలోనే ఉంటారు. ఎల్లుండి తిరిగి కేరళ నుంచి తిరిగి తెలంగాణకు చేరకుంటారు.
Next Story

