Wed Mar 25 2026 07:25:05 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : ఢిల్లీకి రేవంత్.. పదవికి రాజీనామా
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయన తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయన తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. దీంతో మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు.
మంత్రి పదవులపై...
ఆయన తన రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు సమర్పించనున్నారు. అనంతరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి సమావేశమవుతారని తెలిసింది. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులపై ఈ సందర్భంగా రాహుల్‌తో చర్చిస్తారని సమాచారం. కేబినెట్ లో ఖాళీగా ఉన్న మంత్రి పదవులపైన కూడా కాంగ్రెస్ పెద్దలతో చర్చించి ఆయన తిరిగి హైదరాబాద్ రానున్నారు.
Next Story

