Thu Mar 19 2026 17:22:07 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి.. ఆ మూడు స్థానాల కోసం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. పార్టీ కేంద్ర నాయకత్వంతో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. పార్టీ కేంద్ర నాయకత్వంతో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. తెలంగాణ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఇంకా ఖరారు కావాల్సిన స్థానాలపై చర్చించనున్నారు. ఇప్పటికీ మూడు పార్లమెంటు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదు.
అభ్యర్థుల ఎంపిక కోసం...
ఖమ్మం, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినట్లు తెలిసింది. దీంతో పాటు తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, చేయాల్సిన ప్రచారంపై కూడా రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలతో మాట్లాడనున్నారు. అగ్రనేతలను తెలంగాణ ప్రచారానికి రావాలని ఆహ్వానించనున్నారు.
Next Story

