Sun Mar 15 2026 17:24:34 GMT+0530 (India Standard Time)
Telangana : ఖమ్మం జిల్లాకు బయలుదేరిన రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనకు బయలుదేరారు. వరద పరిస్థితిని సమీక్షించనున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనకు బయలుదేరారు. వరద పరిస్థితిని సమీక్షించనున్నారు. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. మున్నేరు వాగు పొంగి ఊళ్లపై పడింది. దీంతో అనేక మంది నిరాశ్రయులుగా మారారు. వారితో నేరుగా మాట్లాడేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటనకు బయలుదేరారు.
రేపు వరంగల్ కు....
అక్కడ అధికారులతో ఆయన వరద పరిస్థితిపై సమీక్షించనున్నారు. తెలంగాణాలో వరదల కారణంగా భారీగా డ్యామేజీ అయింది ఖమ్మం జిల్లానే. అందుకే ఆయన ఈ పర్యటన చేస్తున్నారు. రాత్రికి ఖమ్మంలోనే రేవంత్ రెడ్డి బస చేయనున్నారు. రేపు ముఖ్యమంత్రి వరంగల్ జిల్లాలో పర్యటించి వరద బాధితులను పరామర్శించనున్నారు. నీట మునిగిన పంట పొలాలతో పాటు నష్టపోయిన వారితో మాట్లాడనున్నారు.
Next Story

