Revanth Reddy : "ఆట"లు సాగవు.. పుష్పా.. రేవంత్ వార్నింగ్
సంధ్య థియేటర్ ఘటనపై శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు

పుష్ప సినిమా లో తగ్గేదేలా అంటూ హీరో చెప్పిన డైలాగ్ పాపులర్ అయింది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇక పెంచేదేలా? అంటూ పేల్చిన డైలాగ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సంధ్య థియేటర్ ఘటనపై శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. సంధ్య థియేటర్ లోపలికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఒకే దారి ఉండటంతో సెలెబ్రిటీ వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు అనుమతి ఇవ్వలేదన్నారు.అనుమతి ఇవ్వకపోయినా పుష్ప సినిమా హీరో థియేటర్ కు వెళ్లారని రేవంత్ రెడ్డి అన్నారు. అతను కేవలం థియేటర్ కు వెళ్లి సినిమా చూసి వెళ్ళిపోతే అభ్యంతరం ఉండేది కాదని, కానీ థియేటర్ కు వెళ్ళేటప్పుడు రోడ్డుపై కారు రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటూ వెళ్లారని రేవంత్ రెడ్డి తెలిపారు.

పక్క థియేటర్ నుంచి...
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now