Wed Apr 01 2026 11:58:43 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : నేడు కేరళంలో సీఎం రేవంత్ పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కేరళంలో పర్యటించనున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కేరళంలో పర్యటించనున్నారు. వచ్చే నెలలో కేరళం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆయన వెళ్లారు. ఈ మేరకు రెండు రోజుల పాటు పలు ప్రాంతాల్లో పార్టీ అభ్యర్థుల తరఫున తెలంగాణ సీఎం రేవంత్ ప్రచారం చేయనున్నారు.
ఎన్నికల కోసం...
కాగా రేవంత్ రెడ్డిని కేరళం ఎన్నికల కోసం స్టార్ క్యాంపెయినర్‌గా కాంగ్రెస్ పార్టీ నియమించిన విషయం తెలిసిందే. మరొక వైపు తమిళనాడు, కేరళ ఎన్నికల ప్రచారానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లనున్నారు. కేరళ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్తమ్ పాల్గొననున్నారు. రేపు తమిళనాడులో ఉత్తమ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు.
Next Story

