Tue Jan 20 2026 18:18:14 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి బిజీబిజీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఆయన వరసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఆయన వరసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. తెలంగాణకు కావాల్సిన ప్రయోజనాల గురించి చర్చిస్తున్నారు. నిన్న మావోయిస్టుల ఏరివేతపై హోంశాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను రేవంత్ రెడ్డి కలిశారు.
కేంద్ర మంత్రులను కలసి...
రాష్ట్రానికి వరదల వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని, కోలుకోలేని నష్టం జరగడంతో సాయాన్ని మరింత పెంచాలని అమిత్ షాను రేవంత్ రెడ్డి కోరారు. మరోవైపు నేడు కూడా మరికొందరు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను గురించి చర్చించే అవకాశాలున్నాయి. నేడు పార్టీ పెద్దలతో కూడా రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు.
Next Story

