Tue Mar 24 2026 06:23:20 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈరోజు జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఆయన పాల్గొననున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈరోజు జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఆయన పాల్గొననున్నారు. ఈరోజు ఉదయం పది గంటలకు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా ఉదయం పది గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. సీడబ్ల్యూసీ మీటింగ్ తర్వాత మల్లు భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి ఇద్దరూ పార్టీ పెద్దలను కలసే అవకాశముంది.
మంత్రి వర్గ విస్తరణపై ...
మంత్రి వర్గ విస్తరణపై చర్చించే అవకాశముంది. పది నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ కొన్ని జిల్లాలకు మంత్రులు లేకపోవడంతో మంత్రి వర్గాన్ని పూర్తి స్థాయిలో విస్తరించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇప్పటి వరకూ జమ్మూ కాశ్మీర్, హర్యానా ఎన్నికలు ఉండటంతో మంత్రి వర్గ విస్తరణ గురించి మాట్లాడేందుకు హైకమాండ్ అవకాశమివ్వలేదు. ఈరోజు కేబినెట్ విస్తరణపై పెద్దలతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముంది. అలాగే మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీ నుంచి జార్ఖండ్ బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ మూడు రోజుల పాటు ప్రచారంలో పాల్గొంటారు.
Next Story

