Wed Mar 25 2026 15:24:47 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : గోపన్నపల్లిలో విప్రో సెంటర్ కు ఓకే
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ లో పర్యటిస్తున్నారు. ఆయన విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ప్రేమ్ జీతో సమావేశమయ్యారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ లో పర్యటిస్తున్నారు. ఆయన విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ప్రేమ్ జీతో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి గల అవకాశాలను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులు ప్రేమ్ జీకి వివరంచారు. హైదరాబాద్ లోని గోపన్నపల్లిలో కొత్త సెంటర్ ఏర్పాటుకు విప్రో సంస్థ అంగీకారం తెలిపినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
ఐదు వేల మందికి...
దీనివల్ల మరో ఐదు వేల మందికి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే మూడు రోజుల నుంచి దావోస్ లో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి బృందం వివిధ సంస్థల పారిశ్రామిక వేత్తలతో సమావేశమవుతూ తెలంగాణకు భారీ పెట్టుబడులు తెచ్చే విధంగా పలు సంస్థలతో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకంుటుంది.
Next Story

