Tue Jan 20 2026 06:19:05 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : నేడు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూంకు రేవంత్
ఎన్నికల కోడ్ ముగియడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఎన్నికల కోడ్ ముగియడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు మూడు నెలల నుంచి శాఖల పనితీరును పట్టించుకోలేదు. ఎన్నికల కారణంగా అనేక ఇబ్బందులు, సమస్యలు ప్రజల నుంచి రావడంతో ఆయన శాఖల వారీగా సమీక్షలు జరిపేందుకు సిద్ధమయ్యారు. ఈరోజు బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకుంటారు. పోలీసు శాఖపై సమీక్ష నిర్వహిస్తారు.
రవీంద్ర భారతిలో...
రాష్ట్రంలో నెలొకొన్న శాంతి భద్రతలను ఆయన ఉన్నతాధికారులతో సమీక్షిస్తారు. సాయంత్రం ఐదున్నర గంటలకు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూంకు రేవంత్ రెడ్డి చేరుకుంటారు.అంతకు ముందు ఆయన రవీంద్ర భారతికి వెళ్లనున్నారు. రవీంద్ర భారతిలో జరిగే వందేమాతరం ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలో టాపర్లను రేవంత్ రెడ్డి సన్మానించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో హాజరుతో పాటు చేరే వారి సంఖ్య పెంచడానికే ఈ ప్రయత్నమని అంటున్నారు.
Next Story

