Tue Mar 24 2026 18:25:37 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : ఢిల్లీకి నో... ఇక్కడే ఎన్నికల ప్రచారంలో రేవంత్
ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు.

ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. మే 1వ తేదీన ఢిల్లీ పోలీసుల ఎదుటకు హాజరు కావాల్సి ఉండగా ఆయన వెళ్లడం లేదని తెలిసింది. ఆయన లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ినిర్ణయించారు. ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా జరిగే బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్ లతో పాటు రోడ్ షోలలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
మూడు నియోజకవర్గాల్లో....
ఈరోజు కోరుట్ల, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కోరుట్ల జన జాతర సభకు హాజరుకానున్నారు. రాత్రి 7 గంటలకు కూకట్ పల్లి కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. .30 గంటలకు శేరిలింగంపల్లి కార్నర్ మీటింగ్ కు హాజరుకానున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story

