Revanth Reddy : టాలీవుడ్ అందరూ వాళ్లే... అయినా రేవంత్ తగ్గలేదు అందుకేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకరకంగా తనపై ఉన్న ముద్రను చెరిపేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లే కనిపిస్తుంది.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకరకంగా తనపై ఉన్న ముద్రను చెరిపేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లే కనిపిస్తుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవి చేపట్టడమే ఒక మిరాకిల్. టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఆయనకు ముద్ర ఉంది. చంద్రబాబు అంటే ఇప్పటికీ ఆయనకు గౌరవం ఉంది. తన రాజకీయ జీవితం ఈ స్థాయికి రావడానికి చంద్రబాబు నారు పోశారని రేవంత్ బలంగా నమ్ముతారు. అందుకే పెద్దగా చంద్రబాబుతో సమావేశాలు కాకపోయినా లోపల మాత్రం ఎక్కడో ఒకచోట అభిమానం, అనుకూలత ఉంటుంది. అయితే రాజకీయంగా ఇద్దరివీ వేర్వేరు దారులు. చంద్రబాబుది బీజేపీతో పయనంగా కాగా, రేవంత్ రెడ్డి ఆ కూటమిని వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

