Tue Mar 24 2026 09:10:09 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీలో బిజీ బిజీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నిన్న రాత్రి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలసి ఢిల్లీ వెళ్లారు

తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నిన్న రాత్రి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలసి ఢిల్లీ వెళ్లిన రేవంత్ నేడు పార్టీ హైకమాండ్ తో కలవనున్నారు. రేవంత్ రెడ్డి వెంట పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ కూడా ఉన్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై పార్టీ పెద్దలతో రేవంత్ రెడ్డి బృందం చర్చించనున్నారు.
వివిధ అంశాలపై...
దీంతో పాటు పీసీసీ చీఫ్ నియామకంపై కూడా రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలలో మాట్లాడనున్నారు. త్వరగా పార్టీ చీఫ్ ను రాష్ట్రంలో నియమిస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సులువుగా ఉంటుందని తెలియజేయనున్నారు. ఇప్పటికే ఈ పదవిపై కొన్ని పేర్లను హైకమాండ్ పరిశీలనలో ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి పర్యటన ఢిల్లీలో కొనసాగుతుంది. దీంతో పాటు మంత్రి వర్గ విస్తరణ గురించి కూడా ఒక క్లారిటీని పార్టీ పెద్దల నుంచి తీసుకునే అవకాశముందని చెబుతున్నారు.
Next Story

