Tue Mar 17 2026 04:14:06 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : సోనియాతో భేటీ అయిన రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. సోనియా గాంధీతో సమావేశమయ్యారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన ఈరోజు సాయంత్రం జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. సీడబ్ల్యూసీ సమావేశంలో లోక్సభ ప్రతిపక్ష నేత పై చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించినట్లు తెలిసింది.
సీడబ్ల్యూసీ సమావేశంలో...
ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో ఎనిమిది పార్లమెంటు స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు అనేక విషయాలను ఆయన సోనియా గాంధీతో ప్రస్తావించినట్లు సమాచారం. సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొన్న అనంతరం తిరిగి ఆయన హైదరాబాద్ కు చేరుకుంటారు.
Next Story

