Mon Apr 21 2025 20:15:35 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : నేడు ఢిల్లీకి మళ్లీ రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరస ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు. ఈరోజు కూడా ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరస ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు. ఈరోజు కూడా ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు పార్టీ పెద్దలను ఆయన కలవనున్నారు. ఉదయం పదకొండు గంటలకు ఏఐసీసీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమై ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థలు ఎంపికపై చర్చిస్తారు.
వరసగా ఢిల్లీకి తిరుగుతూనే....
గత కొన్ని రోజులుగా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నా ఇప్పటి వరకూ అభ్యర్థుల ఎంపిక చేయలేదు. నామినేషన్లకు రేపటితో చివరి తేదీ కావడంతో ఈరోజు అభ్యర్థులను ఖరారు చేస్తే తప్ప రేపు నామినేషన్లను నలుగురు అభ్యర్థులు వేయలేరు. అందుకోసమే ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. తెలంగాణలో ఖాళీ అవుతున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో నాలుగింటిలో అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది.
Next Story