Tue Mar 17 2026 16:04:23 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : రేపు విజయవాడ కు రేవంత్ రెడ్డి
రేపు విజయవాడలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉండే అవకాశం ఉంది

రేపు విజయవాడలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉండే అవకాశం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సభకు హాజరుకానున్నారు. సీఎంతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రానున్నారు.
షర్మిల ఆహ్వానంతో...
ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధ్యక్షురాలు వైెఎస్ షర్మిల ఇటీవల ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ప్రచారానికి విశాఖకు ఒకసారి ఏపీకి వచ్చినట్లయింది. తర్వాత ఈరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఉత్సవాలకు హాజరు కానుండటం విశేషం.
Next Story

