Tue Mar 24 2026 13:43:25 GMT+0530 (India Standard Time)
Telangana : నేడు మళ్లీ ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి నేడు ఢిల్లీకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి నేడు ఢిల్లీకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. హైకమాండ్ పిలుపు కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. పిలుపు వస్తే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లుభట్టి విక్రమార్కతో కలసి ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ ఏర్పాటుపై చర్చించేందుకు ఆయన ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది.
మంత్రి వర్గ విస్తరణపై..
ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు మంత్రి వర్గ విస్తరణపై చర్చించారు. అయితే అప్పటికి ఇంకా క్లారిటీ రాలేదు. వీలయినంత త్వరగా మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆరు నెలల నుంచి భర్తీ చేయకపోవడంతో అనేక మంది ఆశావహులు మంత్రి వర్గ విస్తరణ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నెల 4వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుంది.
Next Story

