Sat Dec 06 2025 12:22:14 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ఢిల్లీకి నేడు ముఖ్యమంత్రి బనకచర్ల ప్రాజెక్టుపై
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను కలవనున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను కలవనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ అభ్యంతరాలను కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ కు తెలియజేయనున్నారు.
అవసరమైతే సుప్రీంకోర్టుకు...
బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు జరిగే నష్టాన్ని కేంద్ర మంత్రికి వివరించడంతో పాటు వివిధ పార్టీల నేతలను కూడా కలసి వారిని కూడా తమకు అండగా నిలవాలని కోరనున్నారు. దీంతో పాటు పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుపై మంత్రికి ఫిర్యాదు చేయడమే కాకుండా, స్పందించకుంటే అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు. న్యాయనిపుణులతో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు.
Next Story

