Wed Feb 04 2026 20:39:58 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. అయితే ఒక ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీకి వెళుతున్నారని చెబుతున్నారు. ఢిల్లీలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు అంజలి వివాహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై వధూవరూలను ఆశీర్వదించనున్నారు.
ప్రయివేటు కార్యక్రమంలో...
అయితే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో పార్టీ పెద్దలను కూడా కలిసే అవకాశముంది. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉందని హైకమాండ్ తెలియజేయడంతో రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే రేపు జార్ఖండ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉండటంతో నేడు పార్టీ పెద్దలతో మాట్లాడే వీలుంటుందా? లేదా? అన్నది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. వివాహ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.
Next Story
