Tue Mar 24 2026 16:54:40 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : నేడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. అందుకోసమేనట
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు పార్టీ పెద్దలను ఆహ్వానించేందుకు ఆయన ఢిల్లీకి వెళుతున్నట్లు తెలిసింది. ఈరోజు రాత్రికి ఢిల్లీకి చేరుకుని రేపు సోనియా, రాహుల్ తో సమావేశమవుతారని తెలిసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ముఖ్యఅతిధిగా ఆహ్వానించేందుకు ఆయన ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు.
సోనియాను కలిసి...
సోనియాను కలసి ఆమెను వ్యక్తిగతంగా ఈ వేడుకలకు హాజరు కావాలని కోరనున్నారు. సోనియాను కలిసే కార్యక్రమంలో మల్లుభట్టి విక్రమార్క కూడా ఆయన పాల్గొంటారని చెబుతున్నారు. మల్లు భట్టి విక్రమార్క ప్రస్తుతం పంజాబ్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఈ ఏడాది కాంగ్రెస్ ఘనంగా నిర్వహించాలనుకుంటుంది.
Next Story

