Thu Jan 29 2026 03:02:46 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : ఢిల్లీలోనే ముఖ్యమంత్రి రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. ఇంకా ఆయన పార్టీ హైకమాండ్ తో సమాలోచనలు జరుపుతున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. ఇంకా ఆయన పార్టీ హైకమాండ్ తో సమాలోచనలు జరుపుతున్నారు. రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. ఈరోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలతో కలవనున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సమావేశమవుతున్నారు.
ఖర్గే అధ్యక్షతన...
ఈ సమావేశానికి ఢిల్లీలోనే ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా ఆహ్వానించారు. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ కీలక సమావేశంలో పీసీసీ చీఫ్ నియామకం, నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణపై సమావేశం జరగనుందని తెలిసింది. ఈరోజు పీసీసీ చీఫ్ ఎవరన్నది అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని తెలిసింది.
Next Story

