Thu Mar 19 2026 05:50:31 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన రేవంత్
మంత్రి వర్గ విస్తరణపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు

మంత్రి వర్గ విస్తరణపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తాను మంత్రి వర్గ విస్తరణపై పార్టీ పెద్దలతో మాట్లాడలేదని తెలిపారు. అసలు ఆ ప్రస్తావనే తాను హైకమాండ్ వద్ద తేలేదన్నారు. ఇదంతా మీడియా ఊహాగానాలేనని అన్నారు. పీీసీసీ అధ్యక్షుడిగా తన పదవీ కాలం మూడేళ్లు పూర్తవుతుండటంతో కొత్త అధ్యక్షుడిని నియమించాలని తాను పార్టీ పెద్దలను కోరినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే పార్టీకి కొత్త అధ్యక్షుడి నియామకం జరుగుతుందని తెలిపారు.
ఫిరాయింపులపై...
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే హక్కు లేదన్నారు రేవంత్ రెడ్డి. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్ అని ఆయన గుర్తు చేశారు. ఎందరో ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని ఆయన మంత్రి పదవులు ఇవ్వలేదా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు గురించి మాట్లాడితే నవ్వి పోదురు గాక నాకేమిటి? అన్నట్లు ఉంటుందని అన్నారు. మంత్రివర్గంలో అన్ని శాఖలకు మంత్రులున్నారని, ఏశాఖ ఖాళీగా లేదని చెప్పారు. విద్యాశాఖ తన పరిధిలోనే ఉందని ఆయన గుర్తు చేశారు.
Next Story

