Wed Dec 17 2025 12:50:12 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : జగన్ ఎందుకు ఓటమి పాలయ్యారో చెప్పిన రేవంత్
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ ను ప్రజలు ఎందుకు ఓడించారో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అభిప్రాయాన్ని తెలిపారు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ ను ప్రజలు ఎందుకు ఓడించారో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అభిప్రాయాన్ని తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియా మిత్రులతో చిట్ చాట్ లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు అధికారాన్ని ఇచ్చింది పగలు తీర్చుకోవడానికి కాదని జగన్ ను చూసి నేర్చుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. జగన్ చేిన పనులు తప్పు అని నిరూపించడానికే మొన్నటి ఎన్నికల్లో కేవలం 11 సీట్లను మాత్రమే ప్రజలు ఇచ్చారన్నారు రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చేది పగలు తీర్చుకోవడానికి కాదని, అభివృద్ధి చేయడం కోసం రావాలని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజీ పడను...
అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికీ తెలంగాణ ప్రయోజనాల విషయంలో తాను రాజీపడే ప్రసక్తి లేదని తెలిపారు. చంద్రబాబుకు తన రాష్ట్రంపై ఎంతటి ఆసక్తి, ప్రేమ ఉందో అదే ప్రేమ, నిబద్దత తన రాష్ట్రంపై తనకు ఉంటుందని ఆయన తెలిపారు. తాను చంద్రబాబు కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టనని రేవంత్ రెడ్డి తెలిపారు. తాను ముఖ్యమంత్రిని అవుతానని అనుకోేలేదని, ఆ కల నెరవేరిందని, ఇప్పుడు తన ముందున్న లక్ష్యం తెలంగాణను అభివృద్ధిచేయడమేనని రేవంత్ రెడ్డి అన్నారు.
Next Story

