Thu Mar 19 2026 10:27:27 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : కొడంగల్ లో ఓటు వేసిన రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయాన్నే ఆయన కొడంగల్ లోని పోలింగ్ కేంద్రానికి చేరుకుని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా కొడంగల్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని...
ఓటు హక్కును వినియోగించుకునేందుకు నిన్ననే కొడంగల్ కు చేరుకున్న రేవంత్ రెడ్డి ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని రేవంత్ రెడ్డి కోరారు.
Next Story

