Sun Mar 22 2026 04:02:04 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నారు. ఈరోజు ఉదయం బయలుదేరి వెళ్లి పదకొండు గంటలకు ఏఐసీసీ నేతలతో ఆయన భేటీ అవ్వాల్సి ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. వరసగా ఢిల్లీ పర్యటనలు చేస్తుండటంతో పాటు అధిష్టానం తాము అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని చెప్పడంతో ఆయన హస్తిన పర్యటనను విరమించుకున్నారు.
రేపు చివరి రోజు...
ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేస్తేనే రేపు చివరి రోజు నామినేషన్ వేయడానికి వీలవుతుంది. ఇప్పటికే కొందరు మంత్రులు, ఆశావహులు ఢిల్లీకి చేరుకుని ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలంటూ లాబీయింగ్ చేస్తున్నారు. అయితే ఢిల్లీకి రావాల్సిన అవసరం లేదని, ఫోన్ లోనే చర్చించి ఏఐసీసీ ముఖ్యనేతలను అభ్యర్థులను ఖరారు చేయనుండటంతో రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దయింది
Next Story

