Thu Dec 11 2025 18:16:48 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. శ్రీశైలం ఎడమ కాల్వ లో ఉన్న టన్నెల్ ప్రమాదంపై ప్రధాని ఆరా తీశారు. ప్రమాదం ఎలా జరిగింది? కార్మకులను రక్షించారా? ఎంతమంది టన్నెల్ లో చిక్కుకుపోయి ఉన్నారు? అంటూ రేవంత్ రెడ్డిని ప్రధాని నరేంద్ర మోదీ అడిగినట్లు సమాచారం. ఈ రోజు ఉదయం 8.30 గంటలకు ప్రమాదం జరిగింది.
టన్నెల్ ప్రమాదంపై...
ఈ ప్రమాదం జరిగిన సమయంలో 40 మంది కార్మికులు టన్నెల్ లో ఉండగా, 32 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. సింగరేణినుంచి రెస్క్యూ టీంను తెప్పించి సహాయక చర్యలను కొనసాగిస్తున్నామని, ఎనిమిది మంది కార్మికులను రక్షించే ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారు.
Next Story

