Sun Mar 15 2026 18:21:31 GMT+0530 (India Standard Time)
RevanthReddy : పోలీసులకు తీపి కబురు అందచేసిన రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ శాఖకు వరాలు ప్రకటించారు. ఆర్థిక సాయాన్ని ఆయన పోలీస్ ఫ్లాగ్ డే రోజున ప్రకటించారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ శాఖకు వరాలు ప్రకటించారు. ఆర్థిక సాయాన్ని ఆయన పోలీస్ ఫ్లాగ్ డే రోజున ప్రకటించారు. గోషామహల్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. పోలీసులు ఎన్నో త్యాగాలు చేస్తున్నారని, రాష్త్రం, దేశం కోసం వారు చేస్తున్న సేవలు మరువలేవని తెలిపారు. వారిని ప్రతి ఏటా సర్మించుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమన్న రేవంత్ రెడ్డి పోలీస్ సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
అమరవీరుల కుటుంబాలకు...
పోలీసు అమరవీరుల కుటుంబాలకు భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఏదైనా అనుకోని పరిస్థితుల్లో మరణించిన వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. చనిపోయిన కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి కోటి రూపాయలు, ఎస్.ఐ, సీఐ కుటుంబాలకు కోటిన్నర రూపాయలు, ఐపీఎస్ అధికారులకు రెండు కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. వారు ప్రజాసేవలో దివ్యాంగులుగా మారితే యాభై లక్షలు పరిహారం ఇస్తామని ఆయన తెలిపారు.
Next Story

