Sat Dec 13 2025 22:31:45 GMT+0000 (Coordinated Universal Time)
బనకచర్ల ప్రాజెక్టుపై తమకు అభ్యంతరం లేదు.. ఎప్పుడంటే?
ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశమయ్యారు.

ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో నిర్మించ తలపెట్టిన బనకచర్ల అంశంపై రెండోసారి పాటిల్‌తో ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఉదయం ఒకసారి అన్ని పార్టీల నేతలో కలసిన రేవంత్ రెడ్డి మరొకసారి పాటిల్ ను కలిసి బనకచర్ల ప్రాజెక్టుపై తమ అభ్యంతరాలను మరోసారి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి ప్రాజెక్ట్ వ్యతిరేకమన్నారు. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని సీఆర్ పాటిల్ చెప్పారని రేవంత్ రెడ్డి చెప్పారు.
మరోసారి కలిసిన...
బనకచర్ల ప్రాజెక్ట్ పై ఇంకా పూర్తి డీపీఆర్ రాలేదన్నారని, తమకు కృష్ణా, గోదావరి జిల్లాల్లో 1500 టీఎంసీలకు ఎన్వోసీ ఇస్తే వాళ్లు కట్టుకునే ప్రాజెక్టులకు అభ్యంతరం లేదని చెప్పామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఏపీ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు వస్తున్నాయమని, తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో మాత్రం వేగం కనిపించడం లేదనిఅన్నారు. తెలంగాణకు అన్యాయం చేయబోమని కేంద్రమంత్రి పాటిల్ హామీ ఇచ్చారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తాము బనకచర్ల ప్రాజెక్టుపై పోరాటం చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
Next Story

