Tue Mar 24 2026 08:15:06 GMT+0530 (India Standard Time)
కేసీఆర్ అందుకే ఢిల్లీకి వెళ్లడం లేదట
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. రేపు ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళతారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. రేపు ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళతారు. వాస్తవానికి ఈరోజు సాయంత్రం ఢిల్లీకి కేసీఆర్ బయలుదేరాల్సి ఉంది. రేపు ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనాల్సి ఉంది. ఒకరోజు ముందుగానే పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
రేపు ఉదయం...
కానీ ఈరోజు పర్యటన వాయిదా పడిందని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. రేపు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో సుదర్శన యాగంతో పాటు ప్రత్యేక పూజలు ఉంటాయని తెలిపింది. రేపు ఉదయం కేసీఆర్ బయలుదేరి ఢిల్లీకి వెళ్లి కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొంటారని తెలిపింది.
Next Story

