Tue Mar 17 2026 13:48:16 GMT+0530 (India Standard Time)
మనసు మార్చుకున్న కేసీఆర్...మోదీ వెంటే?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలకనున్నారు. ఆయన పర్యటనలో ఆద్యంతం పాల్గొననున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలకనున్నారు. ఆయన పర్యటనలో ఆద్యంతం పాల్గొననున్నారు. తొలుత కేసీఆర్ మోదీ పర్యటనకు దూరంగా ఉంటారన్న ప్రచారం జరిగింంది. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మోదీకి స్వాగతం పలుకుతారని ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ప్రకటన విడుదల చేసింది. ఇటీవల మోదీని, బీజేపీని తీవ్ర స్థాయిలో కేసీఆర్ విమర్శించిన నేపథ్యంలో ఆయన ప్రధాని పర్యటనకు దూరంగా ఉంటారని అనుకున్నారు.
ప్రధాని వెంటే....
కానీ కేసీఆర్ మనసు మార్చుకున్నారు. శంషాబాద్ లో ఈరోజు మధ్యాహ్నం ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి ప్రధాని వెంట ఇక్రిశాట్ కు బయలుదేరి వెళతారు. అక్కడ ప్రసంగిస్తారు. అనంతరం ప్రధాని వెంట హెలికాప్టర్ లో ముచ్చింతల్ కు చేరుకుంటారు. ప్రధాని తిరుగు ప్రయాణమయ్యే సమయంలోనూ వీడ్కోలు కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు.
Next Story

